AP 10th Class Hall Ticket 2025: ఆంధ్రప్రదేశ్ ప్రాధమిక విద్యా మండలి (BSEAP) 2025 సంవత్సరానికి సంబంధించి AP SSC హాల్ టికెట్ విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ అడ్మిట్ కార్డ్ ను అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక లింక్ పై క్లిక్ చేసి, యూజర్ నేమ్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ను నమోదు చేయడం ద్వారా హాల్ టికెట్ పొందవచ్చు.
Advertisement
How to Download AP 10th Hall Ticket by Whatsapp
ఇంతే కాకుండా, మాన మిత్ర WhatsApp సేవ ద్వారా కూడా హాల్ టికెట్ పొందే అవకాశం ఉంది. విద్యార్థులు 9552300009 నంబర్‌కు సందేశం పంపి, ‘Educational Services’ ను ఎంచుకుని, అప్లికేషన్ నంబర్ లేదా చైల్డ్ ఐడీ, పుట్టిన తేది నమోదు చేస్తే హాల్ టికెట్ నేరుగా మొబైల్‌కి వస్తుంది. ఇంటర్నెట్ సమస్య ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
హాల్ టికెట్‌లో విద్యార్థి పేరు, తండ్రి తల్లి పేర్లు, స్కూల్ వివరాలు, పరీక్షా కేంద్రం, పుట్టిన తేది, లింగం, పరీక్షా మాధ్యమం వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఏదైనా తప్పుదొర్లినట్లయితే, 10 రోజుల్లోపు బోర్డుకు తెలియజేయాలి. ఆలస్యం చేస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ లేకుండా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించలేరు. అందువల్ల, ముందుగానే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని, అన్ని వివరాలు పరిశీలించుకోవడం అవసరం. AP SSC 2025 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శుభాకాంక్షలు!
Advertisement