Nara Lokesh about Mega DSC: ఏపీ అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తర సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. Mega DSC ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల గోడల నిర్మాణానికి రూ.3 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ‘మనపాఠశాల – మన విశ్వక్ష..’ అనే నినాదంతో, పాఠశాల గోడల నిర్మాణాన్ని దశలవారీగా పూర్తి చేయనున్నట్లు వివరించారు.
Advertisement
✔ ‘No Drugs, Bro’ క్యాంపైన్ ప్రారంభించిన ఈ ప్రభుత్వం, ప్రతి స్కూల్, కాలేజీలో ‘ఈగల్’ టీమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
✔ పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ఇచ్చే స్టార్ రేటింగ్ ఆధారంగా విద్యాసంస్థల్లో అవసరమైన వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
✔ మునుపటి ప్రభుత్వం 117 జీవోల ద్వారా పేద విద్యార్థులను విద్యా అవకాశాల నుంచి దూరం చేసిందని, దీనివల్ల 12 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని అన్నారు.
రంపచోడవరంలో 80 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్కూళ్లలో సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ‘Learning Excellence of AP’ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల సహాయంతో స్కూళ్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ CSR ద్వారా అభివృద్ధి చేస్తుండగా, మనమూ అదే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
Advertisement