PAN Card Update: PAN (Permanent Account Number) అనేది ఆదాయపు పన్ను శాఖ అందించే ప్రత్యేక 10 అక్షరాల గుర్తింపు నంబర్. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నిర్వహిస్తుండగా, గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగించబడుతుంది. టాక్స్ చెల్లించే ప్రతి వ్యక్తికి PAN తప్పనిసరి. ఇది ఉద్యోగ వేతనం, ప్రొఫెషనల్ ఫీజులు, ఆస్తుల కొనుగోలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు వంటి అనేక ఆర్థిక లావాదేవీలకు అవసరం.
Advertisement
బ్యాంకింగ్‌లో PAN అవసరం:
✔ సేవింగ్, కరెంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా తెరవడానికి PAN తప్పనిసరి.
✔ ఒకేరోజు ₹50,000కి పైగా నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రా చేస్తే PAN వివరాలు అవసరం.
✔ లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసేటప్పుడు బ్యాంకులు PAN ద్వారా క్రెడిట్ హిస్టరీని పరిశీలిస్తాయి.
✔ సేవింగ్ అకౌంట్, FDలపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని ట్రాక్ చేసి, సరైన టాక్స్ కట్ చేయడంలో PAN సహాయపడుతుంది.
పెట్టుబడుల్లో PAN అవసరం:
✔ షేర్ మార్కెట్ ట్రేడింగ్, డీమాట్ అకౌంట్ ఓపెనింగ్ కోసం PAN తప్పనిసరి.
✔ రూ.50,000కి పైగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు PAN ఉండాలి. ఇది పెట్టుబడులపై ట్రాకింగ్‌కి ఉపయోగపడుతుంది.
✔ బాండ్‌లు, డిబెంచర్లు కొనుగోలు చేయడానికి PAN అవసరం.
✔ రూ.2 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేయాలంటే PAN తప్పనిసరిగా అవసరం.
ఆస్తి లావాదేవీల్లో PAN ప్రాముఖ్యత:
✔ రూ.10 లక్షలకు పైగా విలువైన ఆస్తిని కొనుగోలు చేయాలంటే PAN తప్పనిసరి.
✔ ఆస్తి అమ్మేటప్పుడు, PAN వివరాలను రిజిస్ట్రేషన్ డీడ్‌లో పొందుపరచాలి.
✔ హౌస్ లోన్ కోసం బ్యాంకులకు అప్లై చేసేటప్పుడు PAN ద్వారా ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు.
✔ ఒక సంవత్సరం ₹1 లక్షకు మించిన అద్దె ఒప్పందాల కోసం గుద్దీదారు, యజమాని ఇద్దరూ PAN ఇవ్వాలి.
PAN కార్డు అన్ని ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలకు అత్యవసరమైన గుర్తింపు పత్రం. మీరు మ్యూచువల్ ఫండ్ లేదా ఇతర పెట్టుబడులు ప్లాన్ చేస్తుంటే, మీ PAN వివరాలను అప్‌డేట్ చేయడం మర్చిపోవద్దు!
Advertisement