Advertisement

Govt Scheme: హామీ లేకుండా ₹3 లక్షల రుణం.. వడ్డీ కేవలం 5% మాత్రమే!

Pradhan Mantri Vishwakarma Yojana Loan: చిన్నకార్మికులకు ఆర్థిక సహాయంతో పాటు ఉచిత శిక్షణ అందించే గొప్ప పథకం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన. ఈ పథకంలో ఏమైనా తాకట్టు లేకుండా రూ.3 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. అంతే కాదు, రోజుకు రూ.500 స్టైఫండ్, టూల్ కిట్ కోసం రూ.15,000, డిజిటల్ లావాదేవీలపై ప్రత్యేక బహుమతులు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి, ఈ పథకాన్ని పొందేందుకు అర్హతలు ఏంటో చూద్దాం.

Advertisement

చిన్న వ్యాపారాలను విస్తరించుకోవాలనుకునే ఎంతో మంది కార్మికులు, శిల్పకారులు తగిన పెట్టుబడి లేక వెనక్కి తగ్గిపోతున్నారు. అటువంటి వారికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన. ఈ పథకంలో కేవలం 5% వడ్డీతో రూ.3 లక్షల వరకు రుణం పొందొచ్చు. అంతే కాదు, ఈ రుణాన్ని పొందేందుకు ఎటువంటి పత్రాలు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అంటే ఏమిటి?
ఈ పథకం చిన్నకార్మికులకు ఆర్థిక సాయం మరియు ఉచిత శిక్షణ అందించేందుకు తీసుకురాబడింది. 2023 ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఈ పథకాన్ని MSME మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఇందులో ఉచిత స్కిల్ ట్రైనింగ్, శిక్షణ సమయంలో రోజుకు రూ.500 స్టైఫండ్, టూల్ కిట్ కొనుగోలుకు రూ.15,000 బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

Benefits of Eating Apple Everyday
ఆపిల్ తినడం వలన వచ్చే పరిణామాలు గురించి మీకు తెలుసా..?

రూ.3 లక్షల వరకు తేలికపాటి రుణం:
ఈ పథకం కింద మొత్తం రూ.3 లక్షల రుణం రెండు దశల్లో అందజేస్తారు. మొదటి దశలో రూ.1 లక్ష (18 నెలల కాలవ్యాప్తంగా), రెండో దశలో రూ.2 లక్ష (30 నెలల కాలవ్యాప్తంగా) లభిస్తుంది. ఈ రుణంపై కేవలం 5% వడ్డీ మాత్రమే ఉండటం విశేషం.

ఈ పథకానికి అర్హులెవరు?
ఈ పథకం కింద 18 సాంప్రదాయ వృత్తుల వారికి అవకాశం ఉంది:

  • వడ్రంగులు, బోటు తయారీదారులు
  • కమ్మరి, తాళాల తయారీదారులు
  • బంగారు నిపుణులు, శిల్పులు
  • రాయబడి కార్మికులు, మత్స్యకారులు
  • ధువ్వకులు, దర్జీలు, క్షౌరకులు
  • బొమ్మలు తయారీవారు, కుండలు తయారీవారు
  • పాదరక్షల తయారీదారులు, బుట్టలు/చాపలు/చీపురు తయారీదారులు

దరఖాస్తు ఎలా చేయాలి?
ఈ పథకం లబ్ధిదారులుగా నమోదు చేసుకోవాలంటే 👉 pmvishwakarma.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. ఆధార్ కార్డ్ వివరాలతో e-KYC పూర్తి చేయాలి, సంబంధిత CSC సెంటర్ నుంచి ధృవీకరణ పొందాలి. అంగీకరించిన తరువాత డిజిటల్ సర్టిఫికేట్, ఐడెంటిటీ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మూడు దశల ధృవీకరణ పూర్తయిన తరువాత లబ్ధిదారులు పథకం ప్రయోజనాలను పొందుతారు.

New EMI Rules
New EMI Rules: బ్యాంకు నుండి లోన్ తీసుకొని EMI చెల్లించే వారికి కొత్త నిబంధనలు

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment