Ration Card and Adhaar Link: రేషన్ కార్డుదారులు తక్కువ ధరకే నిత్యావసర సరుకులను పొందే ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటున్నారు. అయితే, ప్రభుత్వం తాజాగా KYC ప్రక్రియను తప్పనిసరి చేసింది. మార్చి 31, 2025 లోపు రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే, ఏప్రిల్ 1, 2025 నుండి మీ రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం పూర్తిచేయండి, లేదంటే రాయితీ ధరల వద్ద బియ్యం, గోధుమలు మరియు ఇతర నిత్యావసరాలు పొందే అవకాశం కోల్పోతారు.
Advertisement
ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి మీ సమీప రేషన్ డీలర్‌ను సంప్రదించండి. ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు తీసుకెళ్లి, బయోమెట్రిక్ లేదా ఫేషియల్ ఈ-కెవైసీ ద్వారా ధృవీకరించండి. ధృవీకరణ పూర్తయిన తర్వాత, మీ ఆధార్ రేషన్ కార్డుకు లింక్ అవుతుంది. ఇది కాకుండా, మీరు “Mera Ration” యాప్ లేదా “Aadhaar Face RD” యాప్ ద్వారా కూడా లింకింగ్ చేయవచ్చు. వాయిదా వేయకుండా ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోండి, లేదంటే మీ రేషన్ సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది!
Advertisement