Advertisement

ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్: మంత్రి నారా లోకేష్

One Model School in Every AP Constituency: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ స్థాపించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ విద్యా ప్రమాణాలను పాటిస్తూ AP Model of Education అమలు చేయాలని సూచించారు. Learning Excellence in Andhra Pradesh (LEAP) ప్రోగ్రామ్ అమలుపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. పాఠశాల విద్య, ఇంటర్ విద్య, ఉన్నత విద్యా శాఖల అధికారులతో సమావేశమై, ఈ ప్రాజెక్ట్ కోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

Advertisement

👉 మార్చి 3న ప్రభుత్వ ఆదేశం (GO) 117 ప్రత్యామ్నాయాలపై ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
👉 గవర్నర్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు లొకేష్ ఆదేశించారు.
👉 NIRF ర్యాంకింగ్స్ మెరుగుదల, ఉన్నత విద్యా సంస్కరణలపై చర్చించాలని పేర్కొన్నారు.

Tata Nano EV
Tata Nano EV మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది.? ధర కేవలం ₹1 లక్ష ధరకే లభించనుందా.?

పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పునరుద్ధరణ కోసం అధికారులకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అలాగే అమరావతిలో AI యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. విద్యా రంగ అభివృద్ధికి అవసరమైన ప్రతి చర్య తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు.

ఈ సమావేశంలో పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె. మధుమూర్తి, కళాశాల విద్య డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MD గణేష్ కుమార్, KPMG ప్రతినిధులు నారాయణన్ రామస్వామి, సౌమ్య వెలాయుధం, వి. మాధవన్ తదితరులు పాల్గొన్నారు.

New EMI Rules
New EMI Rules: బ్యాంకు నుండి లోన్ తీసుకొని EMI చెల్లించే వారికి కొత్త నిబంధనలు

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment