Good News to Government Women Employees: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు పిల్లల వరకే ప్రసూతి సెలవు కల్పించిన నిబంధనను తొలగించి, ఇప్పుడు పిల్లల సంఖ్యకు పరిమితి లేకుండా ప్రసూతి సెలవును అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కాపురం లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఈ ప్రకటన చేయడంతో మహిళా ఉద్యోగులలో హర్షం వ్యక్తమవుతోంది.
జనాభా సమతుల్యత, కుటుంబ అభివృద్ధికి ప్రోత్సాహం
పాశ్చాత్య దేశాలలో జనాభా తగ్గుదల సమస్యను ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు, భారతదేశ అభివృద్ధిలో యువత ముఖ్య భూమిక పోషించాలన్నారు. కుటుంబ నియంత్రణ పథకాలను పాటించకుండా ఎక్కువ పిల్లలని కని దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఇప్పటికే ఇద్దరికి పైగా పిల్లలుంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేని నిబంధనను తొలగించిన ప్రభుత్వం, ఇప్పుడు ప్రసూతి సెలవుపై కూడా పరిమితిని తొలగించి మహిళా ఉద్యోగులకు సంపూర్ణ వేతనంతో సెలవు పొందే అవకాశం కల్పించింది.
Advertisement
