Farmer Subsidy March 2025: రైతులకు మద్దతుగా ప్రభుత్వం 50% సబ్సిడీపై వివిధ వ్యవసాయ యంత్ర పరికరాలను అందించనుంది. ఈ పథకం ద్వారా రైతులు దుక్కి ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, రోటోవేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు వంటి పరికరాలను తక్కువ ధరలో పొందవచ్చు. మార్చి 12, 2025 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
Advertisement
అర్హతలు & దరఖాస్తు విధానం
ఈ పథకానికి SC, ST, మహిళా రైతులు, 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులు అర్హులు. రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. రైతులు తమ వివరాలను వ్యవసాయ సహాయకుల లాగిన్ ద్వారా నమోదు చేయాలి. మండల వ్యవసాయాధికారుల అనుమతితో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు ఆమోదించిన రైతులకు పరికరాలు మంజూరు చేస్తారు.
ప్రభుత్వ మంజూరు & లబ్ధిదారులు
ఈ పథకానికి ₹2.47 కోట్లు మంజూరు చేయగా, 1.44 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పట్టాదారు పాస్‌బుక్ ఉన్న రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. గత 5 ఏళ్లలో ఇలాంటి పథకం ద్వారా పరికరాలు పొందని రైతులు మాత్రమే అర్హులు. వెంటనే అప్లై చేసి ఈ అవకాశం వినియోగించుకోండి!
Advertisement