BEL Machilipatnam Unit Recruitment 2025: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 2025 సంవత్సరానికి సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ ఖాళీల కోసం అఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 26 ఫిబ్రవరి 2025 లోపు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.
Advertisement
BEL Recruitment 2025 Overview
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) అనేది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ప్రముఖ సంస్థ. ఇది వివిధ రక్షణ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ సేవలను అందిస్తుంది. ఈసారి 5 సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు | వివరణ |
---|---|
సంస్థ పేరు | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) |
పోస్టు పేరు | సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ |
మొత్తం ఖాళీలు | 5 |
జీతం | రూ. 30,000 – 1,20,000/- ప్రతి నెల |
పని ప్రాంతం | కృష్ణా (ఆంధ్రప్రదేశ్), పూణే, ముంబై (మహారాష్ట్ర), బెంగళూరు (కర్ణాటక), పంచకుల (హర్యానా) |
దరఖాస్తు విధానం | ఆఫ్లైన్ |
అధికారిక వెబ్‌సైట్ | bel-india.in |
కావాల్సిన అర్హతలు
- విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- వయోపరిమితి: అభ్యర్థి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు (01-02-2025 నాటికి)
- వయస్సు సడలింపు:
- OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు – 10 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు
- సాధారణ అభ్యర్థులు: రూ. 400/-
- SC/ST/PwBD/ మాజీ సైనికులకు: ఫీజు లేదు
- చెల్లింపు విధానం: ఆన్లైన్
జాబ్ ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం
- అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ నింపి, అవసరమైన పత్రాలతో హార్డ్ కాపీ ను పంపాలి.
- దరఖాస్తు ఈ చిరునామాకు పంపాలి:
Deputy Manager (HR & ER), Bharat Electronics Limited, Plot No. 405, Industrial Area, Phase III, Panchkula, Haryana – 134113.
ముఖ్యమైన తేదీలు
- ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 05-02-2025
- ఆఖరి తేది: 26-02-2025
BEL రిక్రూట్మెంట్ 2025 లో సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలో స్థిరమైన ఉద్యోగ అవకాశం కావడంతో, ఆసక్తిగల అభ్యర్థులు చివరి తేదీకి ముందు దరఖాస్తు చేసుకోవడం మంచిది.
Advertisement